News April 24, 2024
మాగుంట విజయ్ రెడ్డి మృతి

మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామ రెడ్డి, పార్వతమ్మ కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి (విజయ్ బాబు) చనిపోయారు. నెల్లూరులోని అపోలోలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయ్ రెడ్డికి బాబాయి అవుతారు.
Similar News
News April 6, 2026
జగన్‌ని తిడితేనే MLAలకు ర్యాంకులు: కాకాణి

జగన్‌ని తిడితేనే ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ పెరిగేలా చంద్రబాబు టార్గెట్ పెట్టారని మాజీ మంత్రి కాకాణి విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మావిగన్ చర్చను అడ్డుకోవడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. రూ.కోట్లు ఖర్చు చేసి జగన్‌పై ట్రోలింగ్ చేయిస్తున్నారు. రాజకీయ విమర్శల పేరుతో ABN రాధాకృష్ణ మహిళలను అవమానించడం దారుణం. చంద్రబాబు ఆదేశాలతోనే ఇలా చేస్తున్నారు’ అని కాకాణి ఫైరయ్యారు.
News April 6, 2026
ఉదయగిరి MLAపై మంత్రికి మహిళ ఫిర్యాదు!

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌పై వెంగమాంబ అనే మహిళ ఇటీవల వరుస ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ను ఆమె కలిశారు. ఉదయగిరిలో ఇటీవల జరిగిన పరిణామాలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. వింజమూరుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఆయనను కలవనీయకుండా పోలీసులు తనను అడ్డుకోవడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని లోకేశ్‌కు చెప్పినట్లు సమాచారం.
News April 6, 2026
నెల్లూరు జిల్లాలో ధరల పెంపు

నెల్లూరు జిల్లాలో విజయ డెయిరీ పాల సేకరణ ధరలు పెరిగాయి. నేటి నుంచే అమలు చేస్తున్నామని డెయిరీ ఛైర్మన్ వెంకట ప్రసాద్ వెల్లడించారు. గేదె పాలకు కేజీ వెన్న శాతం గతంలో రూ.800 ఉండగా రూ.820కి పెంచామని చెప్పారు. రైతులకు లీటరు పాలపై అదనంగా రూ.1.28 అందుతుందన్నారు. ఆవు పాలకు గతంలో రూ.265 ఉండగా ఇప్పుడు రూ.290 చేశామని.. లీటరు ఆవు పాలపై రైతుకు అదనంగా రూ.3 చెల్లిస్తామని చెప్పారు.


