News December 28, 2025

పశ్చిమ గోదావరి కలెక్టర్‌కు పదోన్నతి

image

ప్రభుత్వం 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్‌ టైమ్‌ స్కేల్‌ (లెవల్‌-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌, మేజిస్ట్రేట్‌గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Similar News

News December 31, 2025

సంక్రాంతి సందడి.. పశ్చిమలో హోటళ్లు హౌస్‌ఫుల్!

image

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప.గో జిల్లాకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వస్తుంటారు. పండుగ నాలుగు రోజులు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఉండటానికి హోటళ్లు, లాడ్జిలు ముందుగానే బుక్‌ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల ముందుగానే బుక్‌ చేసుకోవడంతో పండుగ సమయంలో హోటల్‌ రూమ్‌లు దొరకడంలేదు. నాలుగు రోజుల్లో రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

News December 31, 2025

జిల్లా వ్యాప్తంగా బుధవారం పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదవాల నాగరాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్లను సచివాలయ సిబ్బంది నేరుగా అందజేస్తారని పేర్కొన్నారు. జనవరి 1న సెలవు కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె వివరించారు.