News April 24, 2024
IPL: వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ప్రస్తుతం 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 61 రన్స్ చేసింది. ప్రస్తుతం బట్లర్ 28*, జైస్వాల్ 31* క్రీజులో ఉన్నారు. RR విజయానికి 84 బంతుల్లో 119 రన్స్ కావాలి.
Similar News
News March 30, 2026
‘మండే బ్లూస్’.. మీరూ ఇలానే ఫీల్ అవుతారా?

ఆదివారం సరదాగా గడిపాక సోమవారం ఆఫీసుకు వెళ్లాలంటే నీరసంగా ఫీల్ అవుతుంటారు. దీనినే ‘మండే బ్లూస్’ అని పిలుస్తారు. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే.. ప్రశాంతంగా మండేని ప్రారంభించాలి. ఆ రోజు చేయాల్సిన పనులను ఉదయమే ప్లాన్ చేసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. మీకు నచ్చిన పనితో రోజును స్టార్ట్ చేస్తే మీలో ఉత్సాహం పెరుగుతుంది. సోమవారం హ్యాపీగా ముగిస్తే, ఆ వారం అంతా జోష్‌గా ఉంటుంది.
News March 30, 2026
రుచికి, ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్.. ఇడ్లీ!

ఏటా మార్చి 30న ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ జరుపుకుంటారు. దక్షిణ భారతీయుల ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అయిన ఇడ్లీ ప్రాముఖ్యాన్ని చాటడమే దీని ఉద్దేశం. 2015లో చెన్నైలో ఈ వేడుక ప్రారంభమైంది. ఆవిరితో ఉడికించడం వల్ల ఇడ్లీలో కొవ్వు తక్కువగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. అందుకే డాక్టర్లు సైతం దీనిని ఉత్తమ ఆహారంగా సిఫార్సు చేస్తారు. సాంబార్, చట్నీతో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్తారు.
News March 30, 2026
రాష్ట్రంలో ఘోరం.. ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు

AP: విశాఖ LVనగర్‌లో దారుణం జరిగింది. నేవీ టెక్నీషియన్ రవీంద్ర(35) ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. ఇటీవల అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ప్రియురాలు మౌనిక(29)ను ఆదివారం రాత్రి ఫ్లాట్‌కు పిలిచాడు. తర్వాత ఇద్దరిమధ్య గొడవ జరగడంతో ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అనంతరం PSలో లొంగిపోయాడు. అతడి సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


