News April 24, 2024
బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం.. కేటీఆర్ సెటైర్

సూరత్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘వన్ నేషన్-నో ఎలక్షన్.. ఎన్నికల కమిషన్ పనితీరు బాగుంది’ అని పేర్కొన్నారు. సూరత్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది.
Similar News
News March 23, 2026
బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

సాధారణంగా షేర్ మార్కెట్ పడిపోతే బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతుంటుంది. కానీ వార్ మొదలయ్యాక ఇవీ క్రాష్ అవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే జరిగితే స్థిర లాభాలను ఇచ్చే బాండ్లకు డిమాండ్ పెరుగుతుంది. పైగా ఇటీవల బంగారం, వెండి గరిష్ఠాలను తాకాయి. లిక్విడిటీ కొరత కూడా ఉంది. ఈ పరిస్థితిని మదుపర్లు క్యాష్ చేసుకుంటుండటంతో ధరలు తగ్గుతున్నాయి.
News March 23, 2026
ఒకే దేహం.. 2తలలు, 4 కాళ్లతో కవలలు జననం!

యూపీలోని అలీగఢ్‌లో ఓ మహిళకు అవిభాజ్య కవలలు జన్మించారు. వీరికి రెండు తలలు, రెండు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. కానీ గుండె మాత్రం ఒక్కటే ఉంది. తన బిడ్డలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన తల్లి, ఆవేదనతో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువుల ఆరోగ్యం స్థిరంగా ఉండగా.. ఆపరేషన్ చేసి వేరు చేయడంలో సాధ్యాసాధ్యాలను వైద్యులు పరిశీలిస్తున్నారు.
News March 23, 2026
‘నిషేధం’ నుంచి 51603 ఎకరాలకు విముక్తి

AP: పరిశ్రమల కోసం APIICకి GOVT గతంలో 1.56L ఎకరాలు కేటాయించింది. ఇందులో 51603 ఎకరాల పట్టా ల్యాండ్‌తో పాటు ప్రభుత్వ, DKT భూములూ ఉన్నాయి. వీటిలో 121603 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో వీటిని పొందిన పరిశ్రమలు లోన్స్ పొందలేకపోతున్నాయి. కాగా ఈ భూముల్లో 51603 ఎకరాలు తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా భూమిగా IIC పేరిట మ్యుటేషన్ చేయాలని GOVT ఉత్తర్వులు జారీచేసింది.


