News December 28, 2025
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో కేటీఆర్, కవిత పర్యటన

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో సర్పంచులు, ఉపసర్పంచుల సమావేశంలో కేటీఆర్ పాల్గొనగా.. కల్వకుర్తి, అచ్చంపేటల్లో కవిత పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఒకే రోజు అన్నచెల్లెళ్లు జిల్లాకు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీరి పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
Similar News
News January 1, 2026
జీడిమామిడి పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుతం చాలా జీడిమామిడి తోటల్లో పూత, పిందెలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీడిమామిడి పంటను టీ దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫాలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు ఈ సమయంలో ఆంత్రాక్నోస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండిజమ్+ మ్యాంకోజెబ్ 2.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.
News January 1, 2026
సిరిసిల్ల: ‘జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు’

జిల్లాలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం వచ్చే నెల రోజులలో జిల్లా పరిధిలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిషేధమని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News January 1, 2026
కర్నూల్: డీఐజీగా విక్రాంత్ పాటిల్‌కి పదోన్నతి

జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విక్రాంత్ పాటిల్ డీఐజీగా పదోన్నతి పొందారు. ఆయన గురువారం జిల్లా జడ్జి కబర్థిని, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారికి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలుపగా.. పదోన్నతి పొందిన విక్రాంత్ పాటిల్‌ను జిల్లా జడ్జి, రేంజ్ డీఐజీలు ప్రత్యేకంగా అభినందించారు.


