News December 28, 2025
అనకాపల్లి: ఈనెల 30న జడ్పీ సర్వసభ్య సమావేశం

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 30న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.
Similar News
News January 4, 2026
SPMVV: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ (CDOE) 2026 విద్యా సంవత్సరానికి UG/ PG/ PG డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి కలిగిన వారు https://www.spmvv.ac.in/dde/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 19.
News January 4, 2026
మదురోను బంధించిన డెల్టా ఫోర్స్.. అసలు ఎవరీ కిల్లర్ టీమ్?

US సైన్యంలో అత్యంత రహస్యమైన, పవర్‌ఫుల్ విభాగం డెల్టా ఫోర్స్. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇందులో చేరడం చాలా కష్టం. వీరు యూనిఫామ్ ధరించకుండా సాధారణ పౌరుల్లా ఉంటూ రహస్య ఆపరేషన్లు చేస్తారు. సద్దాం హుస్సేన్ పట్టివేత, అల్ బగ్దాదీ హతం తాజాగా మదురో అరెస్ట్ వంటి మిషన్లు వీరే చేశారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ టెక్నాలజీతో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేయడం వీరి స్పెషాలిటీ.
News January 4, 2026
అపార ఖనిజాలు.. అస్తవ్యస్త పాలన.. అంధకారం

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత వెనిజులాకు సరిపోతుంది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్నది అక్కడే (18%-$17 ట్రిలియన్స్). ఐరన్, బాక్సైట్, కాపర్, జింక్, బంగారం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ కంపోనెంట్స్‌లో వాడే నికెల్ నిక్షేపాలూ అపారం. కానీ సొంత&విదేశీ శక్తులతో ప్రభుత్వంలో అస్థిరత వల్ల వాటిని తవ్వి, రిఫైన్ చేసే టెక్నాలజీ, రవాణా ఇబ్బందులతో వెనిజులా భయంకర ఆర్థిక మాంద్యంలో ఉంది.


