News December 28, 2025
KMR: వ్యవసాయ విస్తరణ అధికారుల నూతన కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి జిల్లా తెలంగాణ వ్యవసాయ విస్తరణ సంఘం నూతన జిల్లా అధ్యక్షుడిగా కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా ఎమ్.రాఘవేంద్ర, సలహాదారులుగా జె.శ్రవణ్ కుమార్, సహాధ్యక్షులుగా జీ.వై ప్రభకర్, కోశాధికారిగా ఏస్.ఏ.మూకీద్ ఉపాధ్యక్షులుగా ఎస్.శ్యామ్ సుందర్ రెడ్డి, బి.పవిత్రన్, కె.లిఖిత్ రెడ్డి, పి.శ్రీలత, సంయుక్త కార్యదర్శులుగా జి.రాజాగౌడ్, కె.క్రిష్ణా రెడ్డి, శివ చైతన్య, సౌజన్య ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
Similar News
News January 11, 2026
రాజమార్గం కానున్న.. HYD నుంచి ORR కారిడార్.!

HYD నుంచి ORR చేరుకోవాలంటే సిటీ ట్రాఫిక్ కష్టాల్లో గంటల సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇక త్వరలో ఈ తిప్పలు తీరనుంది. HYD పారడైజ్ జంక్షన్ నుంచి ORR శామీర్‌పేట జంక్షన్ వరకు 18 KM కారిడార్ నిర్మాణం జరగనుంది. ఇందులో 11.5KM ఎలివేటెడ్, 6KM ఎట్ గ్రేడ్, 0.5KM అండర్ గ్రౌండ్ కారిడార్ నిర్మిస్తారు. ఈప్రాజెక్ట్ పూర్తయితే ఇక ORR వెళ్లేందుకు రాజమార్గం కానుందని ఓ అధికారి తెలిపారు.
News January 11, 2026
కాజీపేటలో గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్

కాజీపేటలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడిపికొండ బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కిలో గంజాయి, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బండి నూతన ప్రసాద్ (20) తూర్పు గోదావరి జిల్లా చిన్నయ్యపాలెం వాసిగా గుర్తించారు. NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై బి.శివ తెలిపారు.
News January 11, 2026
మంథని అభివృద్ధికి రూ.45 కోట్లతో శ్రీధర్ బాబు శంకుస్థాపన

మంథని మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు రూ.45 కోట్ల రూపాయలతో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో బస్ స్టాండ్‌లు, కుల సంఘాల కమ్యూనిటీ హాల్‌లు, సీసీ రోడ్ల నిర్మాణాలు, బ్రిడ్జి నిర్మాణం, దేవాలయాల సుందరీకరణ పనులు, ఈద్గా నిర్మాణం పనులు, వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవం, మహిళా సంఘం భవన నిర్మాణం పనులు ఉన్నాయి. వీటితో మంథనికి మహర్దశ పట్టనున్నది.


