News December 28, 2025
పెంచలకోనపై వీడని పీటముడి.. అటా.. ఇటా?

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుంది నెల్లూరు జిల్లా పరిస్థితి. గూడూరును నెల్లూరులో కలపడానికే CM సానుకూలత వ్యక్తం చేశారట. వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాలపై మాత్రం పీటముడి వీడటం లేదు. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరులో కలపాలన్న గట్టి డిమాండ్ ఉంది. కలువాయి(M)న్ని నెల్లూరులో, సైదాపురం, రాపూరు(M)న్ని మాత్రం తిరుపతిలోనే ఉంచనున్నారట. దీంతో పెంచలకోన తిరుపతిలోనే ఉండనుంది.
Similar News
News January 16, 2026
BREAKING.. నెల్లూరు: బీచ్‌లో నలుగురు గల్లంతు..

అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరాన ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒక మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించి సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పండుగ కావడంతో అల్లూరు పంచాయతీకి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లి ఆలల ఉధృతికి గల్లంతయ్యారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మృతదేహాన్ని మత్స్యకారులు బయటికి తీసుకొచ్చారు.
News January 16, 2026
కనుమ పండుగ విశిష్టత మీకు తెలుసా..?

సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీనినే పశువుల పండగ అనికూడా అంటారు. సంవత్సరం కాలం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవాలను ఆరాధించే రోజే ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగగా కనుమ ప్రసిద్ధి చెందింది. ఈ కనుమ రోజు రైతులు తమ పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజించి వాటికి కృతజ్ఞతలు తెలుపుతారు.