News December 28, 2025
REWIND 2025: గుంటూరు జిల్లాలో టాప్ 7 కేసులు

➤ మంగళగిరిలో రూ.5 కోట్ల బంగారు దోపిడీ కేసు
➤ పట్టాభిపురంలో రూ.35 లక్షల ఇంటి దొంగతనం
➤ మేడికొండూరులో హత్య కేసు
➤ కొల్లిపరలో దంపతులచే చేసిన దొంగతనాలు
➤ తెనాలిలో వృద్ధ మహిళల హత్యలు
➤ తాడేపల్లిలో ఈర్ష్య కారణంగా జరిగిన హత్య కేసు పరిష్కారం
➤ పట్టాభిపురంలో ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ వంటి సంచలన కేసులను పోలీసులు ఛేదించారు.
Similar News
News January 13, 2026
తెనాలి: వీడుతున్న హత్య కేసు మిస్టరీ..!

తెనాలి టీచర్స్ కాలనీలో జరిగిన షేక్ ఫయాజ్ అహ్మద్ హత్యకేసు మిస్టరీ వీడుతోంది. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫయాజ్ సహజీవనం చేస్తున్న ఓ మహిళ సహా హత్యకు పాల్పడిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచారం కేసులో పట్టుబడి గతంలో జైలుకు వెళ్లి వచ్చిన మహిళ ముత్యంశెట్టిపాలెంకి చెందిన ఓ వ్యక్తితో కలిసి ఫయాజ్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది.
News January 12, 2026
PGRS ఫిర్యాదులు పునరావృతం కాకూడదు: SP

ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ప్రజల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా సంబంధిత స్టేషన్‌ల అధికారులు పరిష్కరించాలని చెప్పారు.
News January 12, 2026
GNT: సెలవుల్లో ఊరెళ్లే వారికి SP సూచన

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.


