News April 24, 2024
TODAY HEADLINES

* ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల.. 86.69 శాతం ఉత్తీర్ణత
* పులివెందులలో సీఎం జగన్ తరఫున నామినేషన్ దాఖలు
* TG: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే: రేవంత్
* బీఆర్ఎస్‌కు 8-10 ఎంపీ సీట్లు: కేటీఆర్
* సూరత్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ముకేశ్ ఏకగ్రీవంగా ఎన్నిక
* ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చాహల్ రికార్డు
Similar News
News October 17, 2025
ఫేక్ ORSలపై యుద్ధంలో గెలిచిన హైదరాబాద్ డాక్టర్

ప్రస్తుతం మార్కెట్లో ORS పేరిట హానికారక ద్రావణాలను టెట్రా ప్యాకెట్లలో అమ్ముతున్నారు. వీటిని వాడటం పిల్లలకు, మధుమేహులకు, వృద్ధులకు ప్రమాదమని సీనియర్ పీడియాట్రిషియన్ శివరంజని సంతోష్ అంటున్నారు. వీటికి వ్యతిరేకంగా ఆమె 8ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా WHO ఆమోదం పొందిన ఉత్పత్తులు మాత్రమే ORS పేరును ఉపయోగించాలని FSSAI ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర బ్రాండ్లు ORS లేబుల్ ముద్రించవద్దని సూచించింది.
News October 17, 2025
బ్యాంక్ కాల్స్ ఇక ఈ నంబర్ నుంచే!

స్పామ్ కాల్స్‌తో ఇబ్బందిపడుతున్న వినియోగదారులకు త్వరలో ఉపశమనం లభించనుంది. ఇకపై బ్యాంకు నుంచి వచ్చే కాల్స్ ‘1600’తో మొదలయ్యే నంబర్‌తో మాత్రమే రానున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఫైనాన్స్ & బీమా కంపెనీలు 1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి మాత్రమే కాల్ చేయాలని TRAI నిర్ణయించింది. గతంలో ఈ సిరీస్ కొన్ని బ్యాంకులకే పరిమితంగా ఉండేది. ఇతర కంపెనీలు పాత 140 లేదా మొబైల్ నంబర్ నుంచి కాల్స్ చేసేవి. SHARE IT
News October 17, 2025
రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

TG: రేపు బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని DGP శివధర్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా BC సంఘాల నేతలు బంద్ చేపట్టనున్నారు. దీనికి INC, BRS, BJP, CPI, CPM సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.