News December 28, 2025

చిత్తూరు: 12 మంది వీఏఓలకు ప్రమోషన్

image

చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 16 మంది వీఏఓ (గ్రామ వ్యవసాయ సహాయ కులు)లకు ఏఈఓలు(వ్యవసాయ విస్తరణ అధికారులు)గా ప్రమోషన్ కల్పించారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ లభించిన అధికారులు 15 రోజుల్లో కేటాయించిన స్థానంలో విధుల్లో చేరాలని ఆయన ఆదేశాలిచ్చారు.

Similar News

News January 11, 2026

కుప్పం ఏరియాకు భారీ ప్రాజెక్ట్

image

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మానేంద్రం గ్రామంలో విమాన తయారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. HANSA-3(NG) రెండు సీట్ల ట్రైనర్ విమానాల తయారీ, ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటుకు 55.47 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. రూ.159 కోట్లతో రెండు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 250మందికి ఉపాధి లభించనుంది. ఏటా 108 విమానాల తయారీ చేయనున్నారు.

News January 11, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి కిలో రూ.185 నుంచి రూ.190, మాంసం రూ.268 నుంచి 290 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.305 నుంచి రూ.315 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News January 11, 2026

చిత్తూరు: వాట్సాప్‌లో టెట్ ఫలితాలు

image

చిత్తూరు జిల్లాలో టెట్ రాసిన అభ్యర్థులు వాట్సాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరిగాయని చెప్పారు. టెట్ రాసిన అభ్యర్థులు 9552300009 నంబర్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చని డీఈవో వెల్లడించారు.