News December 28, 2025
కొత్తగూడెం: ఈ ఏడాది చోరీ కేసుల వివరాలు ఇలా..!

జిల్లాలో ఈ ఏడాది 307 చోరీ కేసుల్లో రూ.3,75,10,691 సొత్తును కోల్పోగా 141కేసుల్లో రూ.1,21,99,297 సొత్తును రికవరీ చేశామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లోక్ అదాలత్లో ఈ ఏడాది మొత్తం వివిద రకాల 20,595 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 15,347 కేసులు, సైబర్ క్రైమ్ సంబంధించి 196 కేసులు నమోదయ్యాయని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
Similar News
News January 10, 2026
ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ: నిర్మల్ ఎస్పీ

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారని.. ఈ అవకాశాన్ని దొంగలు ఆసరాగా చేసుకునే ప్రమాదం ఉందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఊర్లకు వెళ్లే వారు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఊరికి వెళ్లే ముందు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ జరుగుతుందన్నారు.
News January 10, 2026
అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

ప్రపంచంలో ఎక్కువగా <<18798755>>చమురు<<>> ఉత్పత్తి చేసేది అమెరికానే. 2025లో రోజూ 1.34 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అమ్మింది. అయినా ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎందుకు కొంటోంది? తమ దగ్గర ఉత్పత్తి అయ్యే లైట్ క్రూడ్ విలువ ఎక్కువ కావడమే కారణం. తేలికపాటి ముడి చమురును అధిక ధరకు అమ్మి, హెవీ క్రూడ్‌ను తక్కువకే కొంటోంది. హెవీ క్రూడ్‌ను శుద్ధి చేసే రిఫైనరీలు USలో ఉండటం మరో కారణం. 2025లో 20L బ్యారెళ్లను కొనుగోలు చేసింది.
News January 10, 2026
మెదక్: బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి: కలెక్టర్

బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం సందర్శించారు. అక్కడి పిల్లల సౌకర్యాలు, విద్య, పోషకాహారం వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న మెనూ, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. బాలల వారి సంక్షేమం, ఉన్నత భవిష్యత్‌కు ఆసక్తిని, గమనించి వారి అభివృద్ధికి చేదోడుగా ఉండాలన్నారు.


