News December 28, 2025

హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఆదివారం తెల్లవారుజామున 261కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT

Similar News

News February 21, 2026

జూబ్లీహిల్స్‌లో Mukunda Jewellers ప్రారంభం

image

జూబ్లీహిల్స్‌లో ప్రముఖ జ్యువెలర్స్ Mukunda Jewellers తన తొలి ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌ను ఫిబ్రవరి 20న ఘనంగా ప్రారంభించింది. మధ్యవర్తులు లేకుండా నేరుగా తయారీ ధరలకే వజ్రం, బంగారం, వెండి ఆభరణాలు అందించడం ప్రత్యేకత. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్, గౌరవ అతిథిగా కార్పొరేటర్ వెంకటేశ్ హాజరై ప్రారంభించారు. జూబ్లీహిల్స్ వాసులకు నాణ్యమైన పొదుపు అవకాశంగా ఈ అవుట్‌ లెట్ నిలువనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

News February 21, 2026

హైదరాబాద్ ‘ఫ్యూచర్’ ఇదే!

image

ఫ్యూచర్ సిటీ (FCDA) పరిధిలో ఆకాశమే హద్దుగా భవనాలు ఎగబాకనున్నాయి. సర్కారు ‘యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ 2026’ను పట్టాలెక్కించింది. పాత TG-bPASS సర్కారు అటకెక్కిపోవడంతో ఇక అంతా ‘బిల్డ్ నౌ’ ప్లాట్ ఫామ్‌లోనే. ముచ్చర్ల AI సిటీలో కట్టే బిల్డింగ్‌లకు రోడ్డు వెడల్పుతో సంబంధం లేకుండా 60 అంతస్తులపైనే పర్మిషన్లు ఇచ్చేలా నిబంధనలు సడలించారు. అయితే, ఈ బిల్డింగ్‌లు ‘నెట్ జీరో’ పాలసీని పాటించాలని కండీషన్ పెట్టారు.

News February 21, 2026

HYD: కమాండ్ కంట్రోల్ మెయింటెనెన్స్‌కు రూ.8.35 కోట్లు

image

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు ఈ భవనాన్ని అద్దాల మేడలా మెరిపించేందుకు రూ.8.35 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా 24/7 టెక్ సపోర్ట్, మెకనైజ్డ్ క్లీనింగ్, గ్లాస్ ఫెసాడ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. నగర గర్వకారణమైన ఈ టవర్ ఎల్లప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.