News December 28, 2025

బాపట్ల: 2 ప్రాణాలు బలిగొన్న ఘటనలో నిర్లక్ష్యం ఎవరిది..?

image

బాపట్ల జిల్లా వేమూరులో జరిగిన విషాద ఘటనలో<<18689315>> నిర్లక్ష్యం ఎవరిదని<<>> ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేమూరు పంచాయతీ బేతేలుపురం వద్ద కూలిపనికి వెళ్లి కిందకు వేలాడుతున్న వైరు తగలడంతో సునీల్ (21) మృతి చెందడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వైర్లు కిందికి ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుడు సునీల్ భార్య నిండు గర్భిణి కావడంతో ఆమెకు అధికారులు న్యాయం చేయాలని అన్నారు.

Similar News

News December 31, 2025

వికారాబాద్: ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు: ఎస్పీ

image

నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతి జరగకుండా పోలీసులు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నూతన సంవత్సర బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్‌తో రోడ్లపై డ్రైవింగ్ చేయవద్దన్నారు. ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు.

News December 31, 2025

కృష్ణా: క్షేమంగా ఉంటేనే.. మీ ఇంట్లో ఆనందం.!

image

న్యూ ఇయర్ వేళ యువత అత్యుత్సాహానికి పోకుండా రూల్స్ పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ డ్రైవింగ్, సైలెన్సర్ లేని బైకులు, మద్యం సేవించి వాహనాలు నడపడం మీ ప్రాణాలకే కాదు, మీ కుటుంబానికీ తీరని లోటును మిగిల్చుతాయి. ఒక ఏడాది పోతే మరో ఏడాది వస్తుంది, కానీ ప్రాణం పోతే తిరిగి రాదని గుర్తుంచుకోవాలి. మీరు క్షేమంగా ఉంటేనే మీ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఏ ప్రమాదం జరిగిన నష్టం వెనక్కిరాదని గుర్తుంచుకోవాలి.

News December 31, 2025

సంగారెడ్డి: న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

జిల్లా ప్రజలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నూతన సంవత్సర (2026) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.