News December 28, 2025

NGKL: ఆల్ ఇండియా క్రికెట్ టోర్నీ.. నేడు ఫైనల్

image

నాగర్‌కర్నూల్‌లోని జడ్పీహెచ్ఎస్ మైదానంలో గత వారం రోజుల నుంచి ఆలిండియా లెవెల్ ఓపెన్ T-20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. నేడు(ఆదివారం) “Dolly CC NGKL vs MRCC Chennai” ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు “Way2News” ప్రతినిధితో తెలిపారు. ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ (SATG) ఛైర్మన్‌గా శివసేన రెడ్డి హాజరుకానున్నారు.

Similar News

News December 31, 2025

HYD: 2025లో అందాలు.. అద్భుతాలు.. కన్నీళ్లు!

image

❤︎HYD మెట్రో ఫేజ్-2 పనులు(JAN)
❤︎హైటెక్స్‌లో మిస్ వరల్డ్-2025(MAY)
☹︎గుల్జార్‌హౌస్ ప్రమాదం.. 17 మంది మృతి(MAY)
❤︎సరూర్‌నగర్‌లో బతుకమ్మ వరల్డ్ రికార్డ్(SEP)
☹︎చేవెళ్ల యాక్సిడెంట్.. 17 మంది మృతి(NOV)
☹︎సౌదీలో యాక్సిడెంట్.. 45 మంది హైదరాబాదీలు మృతి
⊘IBOMMA రవి అరెస్ట్(NOV)
❤︎ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ HYD టూర్(DEC)
❤︎గచ్చిబౌలి స్టేడియంలో సూపర్ క్రాస్ రేసింగ్(DEC)
❤︎తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(DEC)

News December 31, 2025

డియర్ కపుల్స్.. మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయండి!

image

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. అయితే దంపతులు కచ్చితంగా ఈ ఒక్క పని చేయాలి. ఈ ఇయర్‌లో జరిగిన గొడవలు, చేదు అనుభవాలు, నచ్చని విషయాలు, ఇద్దరినీ ఇబ్బంది పెట్టిన క్షణాలను ఈ ఏడాదికే పరిమితం చేయండి. వాటిని కొత్త సంవత్సరానికి మోసుకెళ్లి మీ మధ్య దూరాన్ని మరింత పెంచుకోకండి. సమస్యలుంటే ఇవాళే కూర్చుని మాట్లాడుకోండి. డియర్ కపుల్స్.. కొత్త సంవత్సరాన్ని కొత్తగానే స్టార్ట్ చేయండి. Happy New Year.

News December 31, 2025

పెదబయలు: మత్స్యగెడ్డలో మహిళా డెడ్‌బాడీ కలకలం

image

పెదబయలు మండల కేంద్రం సమీపంలోని లకేపుట్టు ఏకలవ్య పాఠశాల వెనక ఉన్న మత్స్యగెడ్డలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. బుధవారం ఉదయం మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా..ఎస్సై వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో డెడ్ బాడీని బయటకు తీయించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆమె ఫొటో ఆధారంగా వివరాలు తెలిస్తే 94409 04227 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.