News December 28, 2025

మీకోసం వెబ్ సైట్‌లో అర్జీలు సమర్పించవచ్చు: అనకాపల్లి కలెక్టర్

image

అర్జీలను మీ కోసం వెబ్ సైట్‌లో కూడా నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేరుగా అర్జీలను స్వీకరిస్తామన్నారు. అంతే కాకుండా నమోదు చేయబడిన అర్జీల సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌కు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చని, అన్ని మండల కార్యాలయాల్లో అర్జీలు తీసుకుంటామన్నారు.

Similar News

News January 13, 2026

నేడు ‘మంచుకొండ’ ఎత్తిపోతల పథకం ప్రారంభం

image

రఘునాథపాలెం మండల రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. ప్రభుత్వం నిర్మించిన ‘మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని’ నేడు ప్రారంభించనున్నారు. రూ. 66.33 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 37 చెరువులను నింపుతూ సుమారు 3,500 ఎకరాలకు సాగర్ జలాలు అందనున్నాయి. 2025 జనవరిలో శంకుస్థాపన చేసిన ఈ పథకాన్ని, మంత్రి తుమ్మల చొరవతో ఏడాదిలోనే పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రైతులకు అంకితం చేస్తున్నారు.

News January 13, 2026

గోదారమ్మ ఒడ్డున సంక్రాంతి ముచ్చట్లు.. మురిపిస్తున్న పల్లెటూరి అందాలు!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. పచ్చని ప్రకృతి ఒడిలో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. ప్రభల తీర్థాలు, కోడి పందాలు, సంప్రదాయ పిండివంటలతో గోదారోళ్ల ఆతిథ్యం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఆత్మీయ పలకరింపులు, బంధుమిత్రుల సందడితో ఉభయ గోదావరి జిల్లాలు ఇప్పుడు దక్షిణ భారతానికే పండగ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.

News January 13, 2026

జలదాత కాటన్ పుణ్యమే.. నేటి గోదావరి లోగిళ్ల స్వర్ణమయం!

image

గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ వైబ్ ఓ రేంజ్‌లో ఉంది. అయితే ఈసమయంలో మనం ఓమహానుభావుడిని తప్పకుండా గుర్తుచేసుకోవాలి. 1833లో ‘డొక్కల కరువు’తో గోదావరి జిల్లాలు అల్లాడాయి. ఆకలి కోరల్లో చిక్కుకున్న ఈప్రాంతాన్ని చూసి చలించిన అపరభగీరథుడు ‘సర్ ఆర్థర్ కాటన్’..1847లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టి గోదావరి జిల్లాలను ‘అన్నపూర్ణ’గా మార్చింది. కాటన్ దొర సంకల్పమే నేటి సంక్రాంతి సిరిసంపదలకు మూలం.