News April 24, 2024

కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: కొప్పుల

image

కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పెద్దపల్లి పార్లమెంట్ BRSపార్టీ MPఅభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎలిగేడు మండల, నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంటలు ఎండిపోతుంటే పాలకులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టాలని అన్నారు.

Similar News

News March 27, 2026

పెట్రో, డీజిల్ ధరల తగ్గింపు చారిత్రకం: బండి సంజయ్

image

పెట్రోలు, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే వ్యాట్ (VAT) తగ్గించాలని డిమాండ్ చేశారు. తద్వారా నిత్యావసరాల ధరలు తగ్గి సామాన్యులకు మేలు జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News March 27, 2026

కరీంనగర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళల పొడిగింపు

image

కరీంనగర్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలను ప్రభుత్వం పొడిగించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన సమయానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 27, 2026

ముగిసిన కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు

image

కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 938 సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా శివ కుమార్, శ్రీధర్ రావు, గీతా రాణి, జనరల్ సెక్రటరీగా కిరణ్ కుమార్, జాయింట్ సెక్రటరీగా దేవా కిషన్, కోశాధికారిగా స్వామి విజయం సాధించారు. కొత్త కమిటీ, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలని సభ్యులు కోరారు.