News December 28, 2025
పాలమూరు: పతంగి కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రాజు-శ్రీలత దంపతుల ఒక్క కుమారుడు సిద్ధు (9), రెండో తరగతి విద్యార్థి. తల్లిదండ్రులు పతంగి కొనివ్వక పోవడంతో మనస్తాపానికి గురై భయపెట్టాలని ఇంటి స్లాబ్‌కు చీరతో ఉరేసుకున్నారు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. కుటుంబంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 2, 2026
VKB: ‘రోడ్డు భద్రతా నియమాలు పాటించండి’

నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలని వికారాబాద్ జిల్లా రోడ్డు రవాణా సంస్థ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో రవాణా మాసోత్సవాల్లో భాగంగా ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలన్నారు.
News January 2, 2026
మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

కొంతకాలంగా తగ్గిన బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో అవైన్ ఇన్ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించారు. దీంతో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అటు నీలగిరి, కోయంబత్తూరు సహా కేరళ సరిహద్దు గల జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. TNలోకి వైరస్ వ్యాపించకుండా కోళ్ల వ్యాన్స్‌ను వెటర్నరీ టీమ్స్ తనిఖీ చేస్తున్నాయి.
News January 2, 2026
జగిత్యాల: దివ్యాంగుల పట్టభద్రుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా దివ్యాంగుల పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా దివ్యాంగుల పట్టభద్రుల సంఘం, జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యులు కలెక్టర్‌కు, జిల్లా సంక్షేమ అధికారికి (డి.డబ్ల్యూ.ఓ) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


