News December 28, 2025

సిరిసిల్ల : TSUTF రాష్ట్ర సదస్సుకు తరలిన నేతలు

image

TSUTF రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు జిల్లాలోని ఆ సంఘం నాయకులు తరలి వెళ్లారు. ఈ నెల 28, 29 జనగామ జిల్లా కేంద్రంలో ఈ సదస్సు జరుగుతుందన్నారు. రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో ప్రభుత్వ విద్య రంగం బలోపేతంపై కార్యచరణ చర్చించడం జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి జంగటి రాజు తెలిపారు. సదస్సుకు వెళ్లిన వారిలో మహేందర్, రమేష్, తిరుపతి జాదవ్, సంతోష్ ఉన్నారు.

Similar News

News December 31, 2025

నేటి నుంచి కొత్త జిల్లాల్లో పాలన

image

AP: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లలో నేటి నుంచే పాలనా వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. కొత్త కలెక్టర్లు, జేసీలను నియమించే వరకు ఉమ్మడి జిల్లాల అధికారులే ఇన్‌ఛార్జులుగా కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది. కాగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది.

News December 31, 2025

SKLM: జనవరి 28 వరకే ఛాన్స్

image

ఫింఛన్‌దారుల జీవన ప్రమాణ ధ్రువీకరణపత్రాలు వచ్చే నెల 28లోపు అందజేయాలని ఖజానా శాఖ ఉపసంచాలకుడు CH రవి కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీసు, కుటుంబ పింఛన్ దారులు వారి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పిస్తే పెన్షన్లు లైవ్‌లో ఉంటాయన్నారు. జనవరి 1 నుంచి 28తేదీ లోపు సంబంధిత ధ్రువపత్రాలు CFMSలో వ్యక్తిగత లాగిన్‌లో అప్లోడ్ చేయాలని, కార్యాలయానికి అందజేయాలన్నారు.

News December 31, 2025

ఒక్క క్లిక్‌తో వీధి దీపాలు.. ఖమ్మం కార్పొరేషన్ కొత్త ప్రయోగం

image

ఖమ్మం నగర పాలక సంస్థలో విద్యుత్ ఆదా, మెరుగైన సేవల కోసం కమిషనర్ అభిషేక్ ఆగస్త్య’CCMS’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని 26,842 వీధి దీపాలను మొబైల్ యాప్ లేదా కంప్యూటర్ ద్వారా నియంత్రించవచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇవి వాటంతట అవే ఆరిపోవడం, వెలగడం జరుగుతుంది. దీనివల్ల నెలకు సుమారు రూ.40 లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవ్వడమే కాకుండా, మరమ్మతులను కార్యాలయం నుంచే పర్యవేక్షించే వీలుంటుంది.