News December 28, 2025
IPLలో నో ఛాన్స్.. నేడు ₹కోట్ల సామ్రాజ్యం

టెస్ట్ అరంగేట్రంలో తొలి బంతికే వికెట్ తీసిన ఏకైక భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన నీలేశ్ కులకర్ణి జర్నీ అద్భుతం. SLతో తొలి మ్యాచ్‌లో 70ఓవర్ల పాటు వికెట్ దక్కకపోయినా, IPL ఛాన్స్ రాకున్నా వెనక్కితగ్గలేదు. ఓటమినే పాఠంగా భావించి International Institute of Sports&Management (IISM) ద్వారా దేశంలోనే తొలి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్లేయర్స్ మేనేజ్‌మెంట్‌లోనూ గెలవొచ్చని నిరూపించారు.
Similar News
News January 10, 2026
అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

ప్రపంచంలో ఎక్కువగా <<18798755>>చమురు<<>> ఉత్పత్తి చేసేది అమెరికానే. 2025లో రోజూ 1.34 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అమ్మింది. అయినా ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎందుకు కొంటోంది? తమ దగ్గర ఉత్పత్తి అయ్యే లైట్ క్రూడ్ విలువ ఎక్కువ కావడమే కారణం. తేలికపాటి ముడి చమురును అధిక ధరకు అమ్మి, హెవీ క్రూడ్‌ను తక్కువకే కొంటోంది. హెవీ క్రూడ్‌ను శుద్ధి చేసే రిఫైనరీలు USలో ఉండటం మరో కారణం. 2025లో 20L బ్యారెళ్లను కొనుగోలు చేసింది.
News January 10, 2026
1.75కోట్ల ఇన్‌స్టా యూజర్ల డేటా లీక్?

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్. సుమారు 1.75 కోట్ల మంది యూజర్ల సెన్సిటివ్ డేటా లీక్ అయినట్లు సైబర్ నిపుణులు వెల్లడించారు. యూజర్ల పేర్లు, మెయిల్స్, ఫోన్ నంబర్లు, అడ్రెస్‌లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు పేర్కొన్నారు. డేటా లీక్ వల్ల హ్యాకర్లు ఐడెంటిటీ థెఫ్ట్‌కు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యూజర్లు పాస్‌వర్డ్ మార్చుకోవాలని, ఇన్‌స్టా పేరుతో వస్తోన్న ఫేక్ మెయిల్స్ నమ్మొద్దని సూచించారు.
News January 10, 2026
ప్రీ బడ్జెట్ సమావేశం.. నిర్మలకు భట్టి విజ్ఞప్తులు

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి కేంద్రమంత్రి నిర్మలను కోరారు. ఢిల్లీలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని, మెట్రో ఫేజ్-2కు అనుమతులు ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలను మంజూరు చేయాలన్నారు. హైదరాబాద్‌లో IIM ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.


