News December 28, 2025

రాజమండ్రి: జనవరి 5న రేషన్ బియ్యం బహిరంగ వేలం

image

జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన 33.85 క్వింటాళ్ల రేషన్ బియ్యానికి జనవరి 5న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జేసీ మేఘ స్వరూప్ ఆదివారం ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద గల పౌరసరఫరాల కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు రూ.50 వేల ధరావత్తు చెల్లించి పాల్గొనాలని సూచించారు. జనవరి 3న నమూనాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. 6ఏ కేసులు ఉన్నవారు ఈ వేలానికి అనర్హులని స్పష్టం చేశారు.

Similar News

News January 6, 2026

పోలీసుల ‘వాట్సాప్’ నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

image

ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే సేవలు పొందేలా ప్రభుత్వం ‘వాట్సాప్ గవర్నెన్స్’ను అందుబాటులోకి తెచ్చిందని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ప్రజలు తమ మొబైల్స్‌లో 9552300009 నంబరును సేవ్ చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఈ-చలాన్ చెల్లింపు, ఎఫ్.ఐ.ఆర్ (FIR) కాపీలు, కేసు దర్యాప్తు స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలు సమయాన్ని ఆదా చేసుకోవాలని ఎస్పీ కోరారు.

News January 5, 2026

తూ.గో: పోలీసు పీజీఆర్ఎస్‌కు 26 ఆర్జీలు

image

తూ.గో. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కు 26 ఆర్జీలు వచ్చినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్‌ తెలిపారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు.

News January 5, 2026

RJY: నేడు కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌తో పాటు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని తహశీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో డిప్యూటీ తహశీల్దార్లు PGRS నిర్వహిస్తారని స్పష్టం చేశారు. భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.