News December 28, 2025

అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

image

AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బందిచే తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవల కాంగ్రెస్ MP వంశీకృష్ణ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ <>వీడియో<<>> రిలీజ్ చేశారు.

Similar News

News January 17, 2026

పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

image

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.

News January 17, 2026

కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

image

AP: ఈ సంక్రాంతి సీజన్‌లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.

News January 17, 2026

162 పోస్టులకు NABARD నోటిఫికేషన్ విడుదల

image

<>NABARD <<>>162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మెత్తం పోస్టుల్లో ఏపీలో 8 ఉన్నాయి. రాతపరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి 2న, మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ 12న నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.550. SC,ST, PwBDలకు రూ.100. సైట్: www.nabard.org