News December 28, 2025
చిట్యాల: రేపటి నుంచి నాపాక బ్రహ్మోత్సవాలు

చిట్యాల మండలం నైనుపాక గ్రామ నాపాక ఆలయ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29, 30, 31న మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఏటా ఆలయం నందు జాతర నిర్వహించి ఎడ్ల బండ్లు, కోలాట బృందాల నృత్య ప్రదర్శనలు, విగ్రహాల ఊరేగింపు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేయాలని కోరుతున్నారు.
Similar News
News January 13, 2026
ఉపాధి పనుల్లో గోల్‌మాల్.. ఏకంగా రూ.21 కోట్లు

పిఠాపురం మండలంలో ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు జరిగినట్లు మంగళవారం నిర్వహించిన సోషల్ ఆడిట్‌లో వెల్లడైంది. 2024-25 ఏడాదికి సంబంధించి రూ.21.45 కోట్ల చెల్లింపుల్లో సంతకాలు, వేలిముద్రలు లేకుండానే నిధులు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. కూలీల వేతనాలు, మెటీరియల్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆడిట్ బృందం పేర్కొంది. క్షేత్రస్థాయిలో జరిగిన ఈ లోపాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
News January 13, 2026
నవీపేట్: గొంతుకోసిన చైనా మాంజా

చైనా మాంజా ఒక రైతు ప్రాణం మీదకు తెచ్చింది. నవీపేట మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన మణికాంత్ పొలం నుంచి గడ్డితో బైక్‌పై వస్తుండగా, చైనా మాంజా మెడకు చుట్టుకుంది. ఈ ప్రమాదంలో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. నిషేధిత మాంజా వాడకం వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News January 13, 2026
భద్రాద్రి: మురిసిన ముత్తాత వంశం.. 5 తరాల ఆత్మీయ సమ్మేళనం

దుమ్మగూడెం(M) నడికుడి గుడి సమీపంలో కొమరం వీరయ్య – బుచ్చమ్మ (లేట్) దంపతుల వంశీయుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా జరిగింది. వారి ఐదుగురు కుమార్తెల కుటుంబాలకు చెందిన కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి మొత్తం 5 తరాల సభ్యులు 178 మంది ఓకే వేదికపై కలుసుకున్నారు. చిన్నచిన్న విషయాలకే విడిపోతున్న కుటుంబ వ్యవస్థలో రక్తసంబంధీకులందరూ ఇలా కలిసి ఉండటం నేటి తరానికి ఆదర్శమని స్థానికులు చెబుతున్నారు.


