News December 28, 2025

ధర్మవరం బాలికల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు

image

ధర్మవరం శ్రీ లలిత నాట్యకళా నికేతన్ గురువులు బాబు బాలాజీ, రామలాలిత్య శిష్య బృందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు కూచిపూడి కళా వైభవం నిర్వహించారు. 25 మంది కళాకారుల బృందం పాల్గొని నాట్యం చేసి మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. ఇప్పటివరకు ఈ సంస్థ 4 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించటం విశేషం.

Similar News

News January 11, 2026

పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

శీతాకాలంలో పసిపిల్లలు ఎక్కువగా జలుబుకు గురవుతారు. అయితే ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం సులువవుతుందంటున్నారు నిపుణులు. శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు/ నీలం రంగులో కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. అలాగే శ్వాస వేగంగా తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News January 11, 2026

HNK: రేపు ‘అనగనగా ఒక రాజు’ ప్రీ-రిలీజ్

image

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకకు HNK వేదిక కానుంది. ఈ నెల 12న హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో భారీ వేడుకను నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నగరంలో సినీ తారల సందడితో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

News January 11, 2026

జనసేనతో పొత్తు అవసరం లేదు: రాంచందర్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో BJPకి పొత్తు అవసరం లేదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. APలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటైందని, ఇక్కడ తాము బలంగా ఉన్నట్లు చెప్పారు. పొత్తు ఉంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అధిష్ఠానానికీ ఇదే విషయం చెబుతామన్నారు. కాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమని JSP నిన్న ప్రకటించింది.