News December 28, 2025
జడ్చర్ల: ట్రాక్టర్ కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అల్లాపురం ఆంజనేయులు కుమారుడు మణిదీప్(5) ఆగి ఉన్న ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయడంతో, అది అకస్మాత్తుగా కదలడంతో ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్ టైరు బాలుడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. కళ్లముందే కుమారుడు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి.
Similar News
News January 5, 2026
చిత్తూరు: లింగం మార్చి.. అమ్మాయి పక్క సీట్ బుక్ చేసి.!

ఇటీవల ఓ అమ్మాయి చిత్తూరు నుంచి బెంగళూరుకు RTC బస్సులో సీట్ బుక్ చేసుకుంది. ఆమె పక్క సీటులో అబ్బాయి ప్రత్యక్షం అయ్యాడు. ఆరా తీయగా మహిళ పేరుతో సీటు బుక్ చేసుకున్నట్లు తేలింది. సదరు అమ్మాయి తండ్రి కండక్టర్‌ను ప్రశ్నించగా నేనేమీ చేయలేనంటూ చేతులెత్తేశాడు. దీనిపై RTC అధికారులు విచారించారు. లింగ వివరాలు తప్పుగా ఉన్న టిక్కెట్లు చెల్లవని DPTO రాము స్పష్టం చేశారు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా.?
News January 5, 2026
ఓయూ డిగ్రీ పరీక్షా తేదీలు వచ్చేశాయ్!

ఓయూ పరిధిలో జరిగే వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షా తేదీలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శశికాంత్ తెలిపారు. BA, BSW, BCom, BSc, BBA రెగ్యులర్ కోర్సుల మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలతో పాటు MA, MCom, MSc, MSW, MLIC, MJ& MC రెగ్యులర్ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
News January 5, 2026
కలుషిత నీరు.. 17కి చేరిన మరణాలు

ఇండోర్ భగీరథ్‌పురలో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి మరణించిన వారి సంఖ్య 17కి పెరిగింది. తాజాగా ఓం ప్రకాశ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మృతిచెందారు. ఇప్పటివరకు 398 మంది ఆస్పత్రిలో చేరగా 256 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం రేపు కోర్టులో నివేదిక ఇవ్వనుంది. మంచినీటి పైప్ లైన్‌లో మురుగునీరు కలవడమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.


