News December 28, 2025
అల్లూరి జిల్లాలో విషాదం.. తండ్రీకొడుకుల మృతి

అల్లూరి జిల్లా కూనవరం మండలం నర్సింగపేటలో ఆదివారం ప్రమాదం జరిగింది. కోడిపుంజుతో ఈత కొట్టించే ప్రయత్నంలో తండ్రీకొడుకులు సింహాద్రి అప్పారావు (42), జస్వంత్ (14) వ్యవసాయ నీటి గుంతలో పడి మృతి చెందారు. ఆశ్రమ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Similar News
News January 14, 2026
ఉదయాన్నే అలసటగా అనిపిస్తుందా?

ఉదయం నిద్రలేవగానే శరీరం బరువుగా, అలసటగా అనిపిస్తే అది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదు. నిద్ర సరిపోకపోవడం, శరీరంలో నీరు తగ్గడం, విటమిన్-D లోపం, మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివి ఇందుకు కారణమవుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోజూ గోరువెచ్చని నీరు తాగడం, సరైన నిద్ర, ఉదయం ఎండలో కూర్చోవడం, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. అయినా అలసట తగ్గకపోతే వైద్య సలహా తప్పనిసరి.
News January 14, 2026
అమెరికాలో 51వ రాష్ట్రం అవ్వనున్న గ్రీన్‌లాండ్!

డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును US కాంగ్రెస్‌లో రిపబ్లికన్ మెంబర్ ర్యాండీ ఫైన్ ప్రవేశపెట్టారు. ‘గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్’ బిల్లు ఆమోదం పొందితే, ఆ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకునే అధికారం ట్రంప్‌కు లభిస్తుంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా అయినా దక్కించుకుంటామని <<18784880>>ట్రంప్<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.
News January 14, 2026
MBNR: ఉచిత శిక్షణ.. అప్లై చేసుకోండి

ఉమ్మడి MBNR జిల్లాలోని గ్రామీణ యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్ & సర్వీసింగ్ కోర్సులలో ఈనెల 19 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందని, 19-45లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 18లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 9542430607 సంప్రదించాలన్నారు.


