News December 28, 2025
KMR: న్యూ ఇయర్ ఎంజాయ్ చేయ్.. కాని రూల్స్ మస్ట్!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పక్కా కార్యాచరణ సిద్ధం చేసిందని KMR ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. DEC 31 రాత్రి 8 గంటల నుంచి ముమ్మర తనిఖీలు ఉంటాయన్నారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయానికి పాల్పడితే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసులకు సహకరిస్తూ నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా జరుపుకోవాలన్నారు.
Similar News
News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. నేలపట్టును చూసేయండి!

దొరవారిసత్రం(M)లోని నేలపట్టు పక్షుల అభయారణ్యం సూమారు 458.92 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. వలస పక్షులు ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడే గుడ్లను పొదిగి పిల్లలు పెద్దవి అయ్యాక స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ఈ పక్షులు పులికాట్ సరస్సులో వేట ముగించుకుని సాయంత్రం నేలపట్టు వద్ద కలపచెట్లపై సేదతీరుతాయి. వీటిని చూసేందుకు బైనాక్యులర్లను ఉంచారు. నేలపట్టు గురించి వీడియో ప్రదర్శన, స్నేక్ షో ఏర్పాటు చేశారు.
News January 10, 2026
OTTలోకి ‘దండోరా’.. డేట్ ఫిక్స్

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన <<18646239>>కామెంట్స్<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
News January 10, 2026
రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

<


