News December 28, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం జిల్లాస్థాయిలో అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో యధావిధిగా ఉంటుందని కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు.

Similar News

News January 5, 2026

ఒక్క వానతో సిద్దిపేట కలెక్టరేట్ కొట్టుకుపోయింది: కవిత

image

ఒక్క వానతో సిద్దిపేట కలెక్టరేట్ కొట్టుకుపోయిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శాసన మండలిలో మాట్లాడుతూ.. ‘అమరుల స్తూపం మొదలుకుని కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతే జరిగింది. పార్టీలో.. ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించా. నన్ను కక్ష గట్టి పార్టీలో నుంచి బయటకు పంపారు. అమరవీరులను బీఆర్ఎస్ ఎప్పుడూ గుర్తించలేదు’ అని అన్నారు.

News January 5, 2026

మొయినాబాద్: 8 నెలలుగా మ్యాథ్య్ టీచర్ లేక 10th విద్యార్థుల ఆందోళన

image

మొయినాబాద్‌లోని హిమాయత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో 8 నెలలుగా గణిత బోధించకపోవడంతో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడుతున్నారు. సిలబస్ పూర్తి కాకుండానే 10వ పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు హిమాయత్‌నగర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బురకాయల రమేశ్ 10వ తరగతి విద్యార్థులను సందర్శించి, MEOతో మాట్లాడి ఉపాధ్యాయుని నియమిస్తానని హామీ ఇచ్చారు.

News January 5, 2026

మీ గుమ్మానికి ‘స్వస్తిక్’ గుర్తు ఉందా?

image

స్వస్తిక్ సానుకూల శక్తి, శుభానికి సంకేతం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగి అదృష్టం వరిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. స్వస్తిక్ వేసిన చోట పరిశుభ్రత పాటించాలని, అక్కడ బూట్లు, చెప్పులు ఉంచకూడదని అంటున్నారు. ఇది ఎరుపు రంగులో ఉంటే అదృష్టమని, ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా నిరోధించవచ్చని సూచిస్తున్నారు. సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం.