News December 28, 2025

VHTలో ఆడనున్న శ్రేయస్ అయ్యర్!

image

గాయం కారణంగా టీమ్‌కు దూరమైన వైస్ కెప్టెన్(ODI) శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అతను పూర్తిగా కోలుకున్నట్లు BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)లోని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ముంబై తరఫున జనవరి 3, 6న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటారని, తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులోకి వస్తారని సమాచారం. OCT 25న AUSతో మ్యాచ్‌లో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే.

Similar News

News December 29, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <>బుక్ చేసుకోండి<<>>.

News December 29, 2025

2025లో 1.22 లక్షల మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు

image

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లక్షకు పైగా టెక్ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. 257 కంపెనీలు 1.22 లక్షల మందిని తొలగించాయని Layoffs.fyi అనే ట్రాకర్ పేర్కొంది. అందులో టీసీఎస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీలూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కారణం కాగా టారిఫ్స్, ద్రవ్యోల్బణం వల్ల ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాయి.

News December 29, 2025

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్.. సీఎం ఏమన్నారంటే?

image

TG: కేసీఆర్ కాసేపటికే అసెంబ్లీ నుంచి <<18700840>>వెళ్లిపోవడంపై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘వెంటనే ఎందుకు వెళ్లారన్నది ఆయననే అడగాలి. ప్రతి సభ్యుడిని మేము గౌరవిస్తాం. ఈ రోజే కాదు ఆసుపత్రిలో కూడా KCRను కలిశాను’ అని అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. అటు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.