News December 28, 2025
కడప: ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ఉల్లి రైతులు.!

నష్టపోయిన ఉల్లి రైతుకు క్వింటాల్‌కు రూ.20ల చొప్పున ప్రభుత్వం సాయం ప్రకటించింది. కడప జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 11,628 ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. వీరపునాయునిపల్లె, మైదుకూరు, దువ్వూరు, వేముల, తొండూరు, వేంపల్లె, ముద్దనూరు మండలాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. పంట చేతికొచ్చిన సమయంలో మార్కెట్లో ధర లేదు. రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
Similar News
News January 11, 2026
గండికోటలో మొదటిరోజు షెడ్యూల్ ఇదే.!

గండికోట ఉత్సవాలలో నేడు(మొదటి రోజు) కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
➤ సాయంత్రం 4:00 – 5:30 గం.వరకు శోభాయాత్ర
➤ 5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
➤ 6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
➤ రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
➤ రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
➤ రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
➤ రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ.
News January 11, 2026
గండికోట ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

గండికోట ఉత్సవాల్లో సందర్శకులకు ఆహ్లాదంతోపాటు వినోదంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గండికోట ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన భాగంగా జిల్లా కలెక్టర్ మీడియాతో శనివారం మాట్లాడారు. గండికోట ఉత్సవాల్లో సందర్శకులకు మరింత వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే విధంగా ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
News January 11, 2026
పల్లెనిద్ర తప్పనిసరి: కడప ఎస్పీ

పోలీస్ అధికారులంతా తప్పనిసరిగా పల్లెనిద్ర చేపట్టాలని జిల్లా ఎస్పీ నచికేత్ సూచించారు. శనివారం కడప పోలీస్ సబ్ డివిజన్ నేర సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి నిలపాలన్నారు. ఫిర్యాదు దారులపట్ల మర్యాదపూర్వకంగా నడుచుకొని సమస్యని పరిష్కరించాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు.


