News December 28, 2025

MHBD: చదువులమ్మ ఒడిలో అ‘పూర్వం’.. @46

image

మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం ZPHSలో 1979 బ్యాచ్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థులు 46 ఏళ్ల తర్వాత ఆదివారం తిరిగి కలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బాబురావు, గోపిరెడ్డి, సోమిరెడ్డి, సోమయ్యలను ఘనంగా సన్మానించారు. అలాగే మరణించిన స్నేహితులకు శ్రద్ధాంజలి ఘటించారు.

Similar News

News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్‌.. నేలపట్టును చూసేయండి!

image

దొరవారిసత్రం(M)లోని నేలపట్టు పక్షుల అభయారణ్యం సూమారు 458.92 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. వలస పక్షులు ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడే గుడ్లను పొదిగి పిల్లలు పెద్దవి అయ్యాక స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ఈ పక్షులు పులికాట్ సరస్సులో వేట ముగించుకుని సాయంత్రం నేలపట్టు వద్ద కలపచెట్లపై సేదతీరుతాయి. వీటిని చూసేందుకు బైనాక్యులర్లను ఉంచారు. నేలపట్టు గురించి వీడియో ప్రదర్శన, స్నేక్ షో ఏర్పాటు చేశారు.

News January 10, 2026

OTTలోకి ‘దండోరా’.. డేట్ ఫిక్స్

image

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన <<18646239>>కామెంట్స్<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

News January 10, 2026

రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

image

<>AP <<>>హెల్త్ , మెడికల్& ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లో 97అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి APMSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 12 నుంచి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగంలో పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/