News December 28, 2025

శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడు?

image

అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో ఎదురుచూసే శబరిమల మకరజ్యోతి 2026లో జనవరి 14న కనిపించనుంది. ఆ రోజు సాయంత్రం 6:30 నుంచి 6:55 గంటల మధ్య పొన్నాంబలమేడు వద్ద దర్శనమిస్తుందని అంచనా. జ్యోతి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దేవస్వం బోర్డు సూచించింది. జనవరి 19 రాత్రి వరకు దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.

Similar News

News February 18, 2026

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వేళాయే

image

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 24న స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం జరగనుంది. 25న తిరుకళ్యాణం, 26న దివ్య విమాన రథోత్సవం వంటి కీలక ఘట్టాలు నిర్వహిస్తారు. 28న గర్భాలయంలోని మూలవిరాట్టుకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా ఇప్పటికే యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

News February 18, 2026

కొల్లేటి వ్యవసాయం గొడ్డు వినాశనం

image

కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతం పల్లపు ప్రదేశం కావడంతో వర్షాకాలంలో వరదలు వచ్చి పంటలు పూర్తిగా మునిగిపోతాయి. దీని వల్ల రైతులు ఎంత పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాదు. అలాగే భూముల్లో వరద నీరు నిలిచిపోవడం వల్ల గడ్డి కుళ్లిపోయి, పశువులకు మేత కూడా లభించదు. ఫలితంగా మేత లేక, రోగాల బారిన పడి పశువులు చనిపోతాయి. అందుకే కొల్లేటి వ్యవసాయం అటు పంటను, ఇటు పశుసంపదను కూడా ముంచేస్తుందని ఈ సామెత భావం.

News February 18, 2026

దేవాలయంలో ఏ దానంతో ఏ పుణ్యం?

image

గుడిలో వస్తురూపేణా చేసే దానాలు విశేష ఫలితాలనిస్తాయి. శంఖం దానంతో పుణ్యలోక ప్రాప్తి, గంట దానంతో కీర్తి, గజ్జెల దానంతో సౌభాగ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘ధ్వజస్తంభంతో యశస్సు, జెండాలతో పాపవిముక్తి, సుగంధ ద్రవ్యాలతో రూప సంపత్తి, పందిళ్లు నిర్మిస్తే ధర్మబుద్ధి కలుగుతాయి. ఇలా ఆలయ అభివృద్ధికి, సౌకర్యాలకు చేసే సాయం భక్తులకు ఇహపర సుఖాలు కలుగుతాయి’ అని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది.