News December 28, 2025
స్మృతి మంధాన అరుదైన ఘనత

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్స్ లిస్ట్‌లో స్మృతి మంధాన కంటే ముందు IND-మిథాలీ రాజ్(10,868), NZ-సుజీ బేట్స్(10,652), ENG-షార్లెట్(10,273) ఉన్నారు.
Similar News
News January 7, 2026
మేడారం జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం!

TG: మేడారం మహా జాతరకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనకు ఆహ్వానపత్రిక అందజేయనున్నట్లు సమాచారం. అటు జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని సీతక్క కోరారు. నిన్న అసెంబ్లీ వద్ద వారికి ఇన్విటేషన్లు ఇచ్చారు. కాగా ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది.
News January 7, 2026
రేపట్నుంచి ‘ఆవకాయ-అమరావతి’ ఉత్సవాలు

AP: ‘ఆవకాయ-అమరావతి’ పేరుతో మరో ఉత్సవానికి విజయవాడ సిద్ధమవుతోంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో రేపట్నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సినిమా, సాహిత్యం, కళలను చాటిచెప్పేలా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి పున్నమి ఘాట్ వద్ద జరిగే ప్రారంభోత్సవంలో CM CBN, Dy.CM పవన్ పాల్గొననున్నారు.
News January 7, 2026
మొక్కజొన్న పొత్తులకు ప్లాస్టిక్ బాటిళ్లు ఎందుకు?

ఆర్గానిక్ పద్ధతిలో మొక్కజొన్నను సాగు చేసే కొందరు రైతులు పొత్తులు వచ్చాక వాటిపై ఉన్న పీచును కత్తిరించి పై ఫొటోలో చూపినట్లుగా ప్లాస్టిక్ బాటిళ్లను ఉంచుతారు. దీని వల్ల పురుగులు, బాక్టీరియా మొక్కజొన్న లోపలికి వెళ్లలేవు. అలాగే వర్షపు నీరు కూడా పొత్తులోకి వెళ్లకుండా కవచంలా పనిచేస్తుంది. ఫలితంగా ఈ పొత్తులు తాజాగా, ఎక్కడా కుళ్లకుండా, గింజ గట్టిబడి ఆకర్షనీయంగా ఉండి మంచి ధర వస్తుందనేది రైతుల అభిప్రాయం.


