News December 28, 2025

పల్నాడు: ఉరేసుకుని మైనర్ మృతి

image

రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చప్పిడి తేజ ఈనెల 13 నుండి కనిపించడం లేదు. అతని తల్లి మదులత 18న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతని తండ్రి శ్రీనివాసరావు కరెంటు పని చేస్తుంటాడు. వీరికి చెందిన స్టోర్ రూమ్‌లో
బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News January 2, 2026

కాకినాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

image

గండేపల్లి మండలం తాళ్లూరు దాబా వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉప్పలపాడుకు చెందిన బండారు దుర్గాప్రసాద్ (38) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. దుర్గాప్రసాద్ తన ద్విచక్ర వాహనంపై జగ్గంపేట వైపు వెళ్తుండగా, మరో బైక్ ఢీకొట్టడంతో కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన పాఠశాల బస్సు ఆయనపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 2, 2026

ప్రజల సంతృప్తి స్థాయిని పెంచండి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

News January 2, 2026

అచ్చంపేట – తిరుపతి ఆర్టీసీ బస్సు సర్వీసు రద్దు

image

అనివార్య కారణాల వల్ల అచ్చంపేట డిపో నుంచి తిరుపతికి వెళ్లే డీలక్స్ బస్సు సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు డిపో మేనేజర్ పి.ఎం.డి.ప్రసాద్ తెలిపారు. అచ్చంపేట నుంచి జనవరి 2, 4, 6, 8, 10 తేదీల్లోనూ, తిరుపతి నుంచి 3, 5, 7, 9, 11 తేదీల్లోనూ సర్వీసులు ఉండవని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.