News December 28, 2025
ఇక నుంచి ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్: విజయనగరం కలెక్టర్

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్లినిక్‌కు ఆర్‌డీఓలు, తహశీల్దార్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. RDO, తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ భూ రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.
Similar News
News January 14, 2026
తెలుగు సాంప్రదాయాలను కాపాడాలి: ఎమ్మెల్యే బేబినాయన

తెలుగు సంప్రదాయాలను కాపాడాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బాడంగి మండలం గజరాయునివలసలో బుధవారం ఎద్దులతో బండ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైతులకు బండ లాగుడు పందెం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 15 గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.
News January 13, 2026
పోలీసు పరేడ్ గ్రౌండులో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు

విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో సంక్రాంతి సంబరాలను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీమణి ఎ.ఆర్.రూపా నాయుడు ముఖ్య అతిధిగా హాజరై సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు పోలీసు కుటుంబాలను కూడా భాగస్వాములను చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
News January 13, 2026
‘విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదు’

రబీ 2025–26 పంట కాలానికి విజయనగరం జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు 12,606 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా.. ప్రస్తుతం 2,914 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని పేర్కొంది. అదనంగా 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరనుంది. రైతులు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని అధికారులు సూచించారు.


