News December 28, 2025
కడియం: ఒకే వేదికపై ఇరు రాష్ట్రాల సీఐలు

వృత్తిరీత్యా ఎక్కడ ఉన్నా.. ఆపదలో ఉన్న సహచరులకు అండగా నిలుస్తూ 2009 బ్యాచ్‌కు చెందిన సీఐలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కడియంలోని జీఎన్‌ఆర్ కల్యాణ వేదికపై ఆదివారం రెండు రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది అధికారులు ఆత్మీయంగా కలుసుకున్నారు. 2022 నుంచి ఏటా కలుస్తున్న వీరు, ఇప్పటివరకు మరణించిన 15 మంది సహచరుల కుటుంబాలకు రూ.8.20 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని అందించి తమ ఉదారతను చాటుకున్నారు.
Similar News
News January 1, 2026
గోదావరిలో దూకబోయిన తల్లి, కూతురు.. కాపాడిన పోలీసులు

కొవ్వూరు గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, పదేళ్ల కుమార్తెను శక్తి టీం పోలీసులు బుధవారం కాపాడారు. 112 నంబర్ నుంచి అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఈ అఘాయిత్యానికి సిద్ధపడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.

News December 31, 2025
నిడదవోలులో విషాదం.. పదేళ్ల బాలుడి మృతి

నిడదవోలు మండలం మునిపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అత్తిలి భరత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సమిశ్రగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.