News December 28, 2025

కామారెడ్డి: ఫిబ్రవరిలో జనసేన క్రియాశిలక సభ్యత్వాలు

image

కామారెడ్డి దేవి విహార్‌లో జనసేన జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జీవన్ నాయక్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో క్రియాశీలక సభ్యత్వాలు నిర్వహించాలని రవీందర్ చౌహన్ సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ, కృష్ణ స్వామి, సుకదేవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News February 13, 2026

తిరుపతి: మొన్న రిమూవ్.. నిన్న రిలీవ్!

image

TTD ఎస్వీ వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్ వ్యవహారం మలుపులు తిరిగింది. రిజిస్ట్రార్ భాస్కరుడును ఈనెల 4న రిమూవ్ చేసినట్లు VC ఉత్తర్వులు ఇచ్చారు. వారం రోజులు అదే సీటులో ఉండగా 11న పదవి కాలం ముగియడంతో రిలీజ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక రిమూవ్ చేసిన రోజు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఒక్కరికి ఇవ్వగా.. రిలీవ్ రోజు మరొకరికి ఇన్‌ఛార్జ్ ఇచ్చారు.

News February 13, 2026

ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.

News February 13, 2026

NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో NOV 2025లో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ వొకేషన్ 3వ సెమిస్టర్, AUG 2025లో నిర్వహించిన డిప్లొమా ఇన్ మ్యూజిక్(వోకల్) రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ANU అధికారిక వెబ్‌సైట్‌ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.