News December 29, 2025
కామారెడ్డి: జిల్లాలో చలి తీవ్రం.. అప్రమత్తత అవసరం

కామారెడ్డి జిల్లాలో చలి ప్రభావం మళ్లీ ఎక్కువైంది. రానున్న మూడు రోజుల్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఆరంజ్ అలెర్ట్ లోనే కొనసాగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. పిల్లలు, వృద్ధులు వెచ్చటి వస్త్రాలతో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News January 12, 2026
NLG: సర్కార్ మాటలకే పరిమితం.. కొత్త పథకం ఎక్కడా?

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మాటలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతామన్న హామీ కూడా ప్రభుత్వం మరిచిపోయిందని వృద్ధులు మండిపడుతున్నారు. జిల్లాలో వేలాదిమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
News January 12, 2026
స్ఫూర్తిని నింపే స్వామి వివేకానంద మాటలు

⋆ లేవండి, మేల్కోండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి
⋆ నీ వెనుక, నీ ముందు ఏముందనేది నీకనవసరం. నీలో ఏముందనేది ముఖ్యం
⋆ రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు
⋆ భయపడకు, ముందుకు సాగు.. బలమే జీవితం, బలహీనతే మరణం
⋆ కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు
☛ నేడు వివేకానంద జయంతి
News January 12, 2026
జనగామ: నొక్కేసిన డబ్బులను రైతులు కట్టాలట!

ఇదే విచిత్రం. జనగామ భూ భారతిలో కేటుగాళ్లు నొక్కిసిన ప్రభుత్వ ఖజనాకు రావాల్సిన డబ్బులను రైతులు చెల్లించాలంటూ జనగామ తహశీల్దార్ నోటీసులు ఇవ్వడం వివాదాస్పదమైంది. ప్రభుత్వానికి తక్కువ ఛార్జీ చెల్లించారని, మిగిలిన మొత్తం కట్టాలంటూ ఇద్దరు రైతులకు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి వారు చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్ ద్వారా వచ్చే పత్రంలో ఉన్నా, డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.


