News December 29, 2025
పుష్పగిరిలో ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం

వల్లూరు(M) పుష్పగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం అద్భుతంగా ఉందని రచయిత చరిత్రకారుడు బొమ్మి శెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సృష్టి పాలకుడు, పరమేశ్వరుడు సృష్టి లయ కారకుడన్నారు. త్రిమూర్తులు ఒకే పరబ్రహ్మం మూడు రూపాలు అని చెప్పారు.
Similar News
News January 12, 2026
‘ప్రజా సంక్షేమంలో నిర్లక్ష్యం వద్దు’

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
News January 12, 2026
కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా నియమితులు కానున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అతిథి సింగ్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా జిల్లాకు రానున్నారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
News January 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.


