News December 29, 2025
మీకోసం వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చు: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు Meekosam.ap.gov.in దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను నం.1100 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.
Similar News
News February 20, 2026
ట్రంప్‌కు BIG SHOCK

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయా దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లను కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి టారిఫ్‌ల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం చట్టవిరుద్ధమని తెలిపింది. సుప్రీం తీర్పుతో US మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
News February 20, 2026
నెల్లూరు: సోలార్ కరెంట్‌లో సమస్య ఉందా?

నెల్లూరు సహా APSPDCL పరిధిలోని సోలార్ విద్యుత్ వినియోగదారులు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారం కోసం ఆ సంస్థ CMD శివశంకర్ లోతేటి కీలక ప్రకటన చేశారు. సోలార్ ప్యానెల్స్, కనెక్షన్ తదితర సమస్యలు ఉంటే 1912 టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. IVRS కాల్ చేసిన తర్వాత ‘5’ అంకెను నొక్కడంతో నేరుగా సోలార్ ఫిర్యాదు నమోదు అవుతుందన్నారు.
News February 20, 2026
GDK: వైష్ణవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నరేష్

పెద్దపల్లి జిల్లా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షుడిగా కొండపల్కల నరేష్ ను గోదావరిఖనిలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన శ్రీహరి, శ్రావణ్, అభి, కిషోర్, వెంకన్న, వేణు, రఘు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అధికారిగా ఉన్న దాస్యం కృష్ణ, గరిమెళ్ళ శ్రీనివాస్, గరిమెళ్ళ రమేష్, బండవరం సత్యనారాయణకు అభినందనలు పేర్కొన్నారు.


