News December 29, 2025
చివరి గ్రీవెన్స్‌ను పబ్లిక్ సద్వినియోగం చేసుకోండి : జిల్లా ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసేందుకు ఇది ఎంతగానో అనుకూలమైన కార్యక్రమం అన్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి పీజీఆర్ఎస్.
Similar News
News January 2, 2026
చిత్తూరు: 59 వేల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో 59,701 పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని 298 గ్రామాల పరిధిలోని అర్హులకు అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. రీ సర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికను ఉపయోగించి కచ్చితంగా భూ హద్దులను నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అధికారులు.. ప్రజాప్రతినిధులతో కలిసి అందజేస్తారని చెప్పారు.
News January 2, 2026
మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 2, 2026
పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


