News April 24, 2024
వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయి ఆదాయం
TG: వేములవాడ రాజన్న ఆలయానికి 2023-24లో రూ.119.72 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మేడారం జాతర రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగి మంచి ఆదాయం సమకూరిందని చెప్పారు. 2021-22లో అత్యధికంగా రూ.87.78 కోట్లు రాగా, ఈసారి అదనంగా రూ.31 కోట్ల ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.32 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.21 కోట్లు, టికెట్ల విక్రయంతో రూ.22 కోట్లు సమకూరింది.
Similar News
News November 20, 2024
సైబర్ బాధితుడికి పరిహారం ఇవ్వాలని SBIని ఆదేశించిన ఢిల్లీ HC
సైబర్ దాడికి గురైన బాధితుడికి పరిహారం ఇవ్వాలంటూ SBIని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హరే రామ్ సింగ్ సైబర్ మోసానికి గురై, వెంటనే దగ్గర్లోని SBIకి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సిబ్బంది 2 నెలల తర్వాత అతడి అభ్యర్థనను తిరస్కరించారు. అతడు ఫ్రాడ్ లింక్ ఓపెన్ చేయడం, OTP చెప్పడాన్ని సాకుగా చూపారు. అయితే SBIది నిర్లక్ష్యమైన స్పందనగా పేర్కొన్న HC ₹2.6లక్షలు బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.
News November 20, 2024
ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్ న్యూస్?
TG: ముగ్గురు సంతానం ఉన్న వారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయించిందని సమాచారం. దీంతో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వారు కూడా సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అటు APలో ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి పోటీకి అవకాశం కల్పించింది.
News November 20, 2024
రోహిత్, కోహ్లీ, జడేజాకు షాక్?
భారత జట్టు సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజాల టెస్ట్ క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. వాళ్లను పక్కనబెట్టాలని డిమాండ్లు వస్తుండటంతో BGT సిరీస్‌లో వారి ఆటతీరును BCCI స్వయంగా పర్యవేక్షించనుంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియాలోనే ఉండి కోచ్ గంభీర్‌తో కలిసి ఈ ముగ్గురి భవిష్యత్తుపై చర్చింవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదే వాళ్లకు ఆఖరి సిరీస్ అయ్యే ఛాన్సూ ఉంది.