News December 29, 2025
రైలు ప్రమాదం.. నిలిచిన రైళ్లు

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ <<18699122>>ప్రమాదం<<>>తో ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యం కానున్నాయి. అనకాపల్లి, తుని, విశాఖ తదితర రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రయాణికులు ప్రస్తుతం స్టేషన్‌లో ఉన్నారు.
Similar News
News January 5, 2026
నీళ్లు.. నిప్పులు!

ఉమ్మడి ఏపీలో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రం ఏర్పడ్డాక AP, TG ప్రభుత్వాలు తమతమ సంపద సృష్టించుకుంటున్నాయి. ఎక్కడివారికి అక్కడే ఉద్యోగాలూ లభిస్తున్నాయి. కానీ నీళ్ల విషయంలో మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వార్ నడుస్తోంది. కృష్ణా జలాల్లో వాటా, ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటున్నారు. ఇవాళ SCలో నల్లమల సాగర్‌పై విచారణ జరగనుంది.
News January 5, 2026
173 నాన్ టీచింగ్ పోస్టులు.. అప్లై చేశారా?

NCERTలో 173 గ్రూప్ A, B, C నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Li.Sc, B.Li.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ncert.nic.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 5, 2026
MECON లిమిటెడ్‌లో 44 పోస్టులు

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<


