News April 24, 2024

విశాఖ: 29, 30 తేదీల్లో విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ టోర్నమెంట్

image

విభిన్న ప్రతిభావంతుల స్టేట్ ఇంటర్ జోన్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 29, 30 తేదీల్లో విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ్యాచ్ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.

Similar News

News March 17, 2026

విశాఖ తీరంలో మృతదేహం కలకలం

image

విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వైఎంసీఏ బీచ్ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. త్రీటౌన్ సీఐ పైడయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని గుర్తించిన వారు వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

News March 17, 2026

విశాఖ: ఒకే వేదికపై ప్రత్యర్థులు

image

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత ఎన్నికల్లో పరస్పర విమర్శలతో హోరెత్తించిన గంటా, అవంతి శ్రీనివాసరావు ఈ వేడుకలో చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

News March 17, 2026

ఎట్టకేలకు విశాఖ డీఆర్‌వో పోస్టు భర్తీ

image

విశాఖ జిల్లాలో కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న డీఆర్‌వో పోస్టును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. కడప జిల్లా డీఆర్‌వో (స్పెషల్ గ్రెడ్ డిప్యూటీ కలెక్టర్)గా ఉన్న ఎం.విశ్వేశ్వర నాయుడును విశాఖకు బదిలీ చేసింది. గతేడాది అక్టోబర్‌లో ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్‌వో భవాని శంకర్ మధ్య విభేదాల కారణంగా ఇద్దరినీ రిలీవ్ చేశారు. అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉండగా, తాజా నియామకంతో అనిశ్చితికి ముగింపు పలికింది.