News December 29, 2025
ఇంటర్వ్యూతో ఆచార్య NG రంగా వర్సిటీలో టీచింగ్ పోస్టులు

AP: ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 8 టీచింగ్ అసోసియేట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc, MSc(హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్ & ఫ్యామిలీ స్టడీస్, ఫుడ్ సైన్స్&న్యూట్రీషన్), PG లైబ్రరీ సైన్స్, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హతగల వారు ఇవాళ, రేపు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వెబ్‌సైట్: angrau.ac.in
Similar News
News January 2, 2026
IIIT పుణేలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News January 2, 2026
ముస్తాఫిజుర్ IPLలో ఆడతారా? BCCI రిప్లై ఇదే?

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస <<18733577>>దాడుల<<>> నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను IPLలో ఆడించొద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే బంగ్లా ప్లేయర్లను బ్యాన్ చేయాలంటూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని BCCI ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని KKR, ఆ టీమ్ ఓనర్ షారుఖ్ ఖాన్‌ను పలువురు హిందూ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.
News January 2, 2026
అధిక వడ్డీ ఆశ చూపి మోసం.. ప్రభుత్వం చర్యలు

AP: కర్నూలు జిల్లాలో అధిక వడ్డీ ఇస్తామంటూ స్కీమ్‌లతో మోసం చేసిన ‘శ్రేయ గ్రూప్’పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓనర్లు హేమంత్ కుమార్, సంగీతారాయ్ పేరిట ఉన్న ఆస్తులు సీజ్ చేసేందుకు CIDకి అనుమతి ఇచ్చింది. దీంతో జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో 51.55 ఎకరాల భూమిని CID సీజ్ చేయనుంది. భార్యాభర్తలైన హేమంత్, సంగీత 8,128 మంది డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశారు.


