News April 24, 2024

విశాఖ-బెంగళూరు, HYD-అర్సికెరె మధ్య 58 స్పెషల్ ట్రైన్స్

image

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 30 వరకు శని, ఆదివారాల్లో విశాఖపట్నం- బెంగళూరు మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 25 నుంచి జూన్ 28 వరకు హైదరాబాద్-అర్సికెరె(కర్ణాటక), సికింద్రాబాద్-అర్సికెరె మధ్య 38 స్పెషల్ ట్రైన్స్ తిరగనున్నాయి. పైనున్న ఫొటోలలో రైళ్ల వివరాలు తెలుసుకోవచ్చు.

Similar News

News November 20, 2024

ఢిల్లీలో మన పరపతి వేరే లెవెల్: చంద్రబాబు

image

AP: 21 మంది ఎంపీలుండటంతో ఢిల్లీలో మన పరపతి బాగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. ‘గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు శాపంగా మారాయి. రాష్ట్రం దాదాపు వెంటిలేటర్‌పై ఉన్నట్లుంది. ఇచ్చిన హామీలపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News November 20, 2024

మహాకుట్రపై విచారణ జరిపించండి: హోంమంత్రికి TDP MLA లేఖ

image

AP: YCP హయాంలో CM చంద్రబాబుపై జరిగిన మహా కుట్రపై విచారణ జరిపించాలని హోంమంత్రి అనితకు నెల్లూరు రూరల్ TDP MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. ‘బాబుపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచింది. ఇది కచ్చితంగా కుట్రేనని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ కూడా చెప్పారు. సీఎంవోలో పెద్దల మద్దతు ఉంటేనే ఈ కుట్ర సాధ్యం. దీనిపై విచారణ చేయాలని డీజీపీకి కూడా లేఖ రాశా’ అని ఆయన పేర్కొన్నారు.

News November 20, 2024

పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

TG: వికారాబాద్(D) లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆయన పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. వాకింగ్‌కు వెళ్లిన ఓ మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. తీర్పును రిజర్వ్ చేసింది.