News December 29, 2025
చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి?

శివాలయాల్లో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి ఎడమ వైపుగా అభిషేక జలం బయటకు వచ్చే ‘సోమసూత్రం’ వరకు వెళ్లాలి. ఆ నీటిని దాటకుండా, తిరిగి వెనక్కి వస్తూ ధ్వజస్తంభాన్ని చేరుకోవాలి. ఆపై కుడి వైపుగా సోమసూత్రం వరకు వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వద్దకు రావాలి. ఇలా ఓసారి పూర్తి చేస్తే ఓ చండీ ప్రదక్షిణ అవుతుంది. సోమ సూత్రం దాటకుండా చేసే ఈ ప్రదక్షిణ అతి శక్తిమంతమైనది.
Similar News
News January 13, 2026
షాక్స్‌గామ్ వ్యాలీ.. భారత్‌కు ఎందుకంత కీలకం?

<<18842137>>షాక్స్‌గామ్ వ్యాలీ<<>> భారత్‌కు భౌగోళికంగా, రక్షణ పరంగా చాలా కీలకం. ఇది ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. భారత్ మాత్రం దీన్ని తన భూభాగంగానే పరిగణిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ శత్రువులకు పట్టు చిక్కితే లద్దాక్‌లోని సైనిక కదలికలను ఈజీగా గమనించొచ్చు. ఈ ప్రాంతం ద్వారా చైనా, పాక్ మధ్య రాకపోకలు పెరిగి ఒకేసారి భారత్‌పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది.
News January 13, 2026
షాక్స్‌గామ్ లోయను చైనాకు పాక్ ఎందుకిచ్చింది?

1963లో INDను వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పాక్ షాక్స్‌గామ్ లోయను చైనాకు అప్పగించింది. USపై నమ్మకం తగ్గడం, 1962 యుద్ధానంతరం చైనాతో స్నేహం ద్వారా రాజకీయ పట్టు సాధించాలని భావించింది. చిన్నపాటి సరిహద్దు వివాదాలనూ ముగించాలనుకుంది. ఈ ఒప్పందంతో POKపై పాక్ నియంత్రణను చైనా గుర్తించింది. బదులుగా కారకోరం పాస్‌పై చైనాకు ఆధిపత్యం దక్కి భారత్‌లోని సియాచిన్, లద్దాక్ ప్రాంతాలకు భద్రతా ముప్పు ఏర్పడింది.
News January 13, 2026
రాహుల్ విపక్ష నేత కాదు పర్యాటక నేత: షెహజాద్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయన ఎప్పుడూ సెలవుల మూడ్ లోనే ఉంటారు. కీలకమైన జాతీయ సమస్యల సమయంలోనూ విదేశాల్లోనే గడుపుతారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పర్యాటక నాయకుడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. రాహుల్ అపరిపక్వ నాయకుడని విమర్శించారు. కాగా వియత్నాం పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ, INC ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.


