News April 24, 2024

నేడు పవన్ కళ్యాణ్ నామినేషన్

image

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9.30కు చేబ్రోలు నుంచి ర్యాలీగా బయలుదేరి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ క్షేత్రం వరకు వెళ్తారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారు.

Similar News

News January 18, 2026

చైనాలో నోరోవైరస్ కలకలం.. కొత్తదేనా?

image

చైనాలోని ఓ స్కూల్‌లో 100 మందికి పైగా విద్యార్థులు నోరోవైరస్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. 1968లోనే USలో బయటపడింది. భారత్‌లో కూడా గతంలో కేరళ, పుణే వంటి నగరాల్లో ఈ వైరస్ కలకలం రేపింది. ఆహారం, నీరు లేదా సోకిన వ్యక్తి ద్వారా ఇది వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాపాయం తక్కువే. అయినా తీవ్రమైన నీరసం, డీహైడ్రేషన్, డయేరియాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News January 18, 2026

ఆర్టీసీకి భారీ ఆదాయం.. 5 రోజుల్లో రూ.67కోట్లు

image

TG: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఛార్జీల ద్వారా రూ.67.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రోజుకి సగటున రూ.13.48కోట్లు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీ 6,431 స్పెషల్ బస్సులను నడపగా, రోజుకి అదనంగా రూ.2.70కోట్లు వీటి ద్వారానే సమకూరినట్లు చెప్పారు. ఇవాళ, రేపు కూడా స్పెషల్ బస్సులు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

News January 18, 2026

సూర్యుడి 7 గుర్రాల పేర్లు మీకు తెలుసా?

image

సూర్యరశ్మి7 రంగుల మిశ్రమమని సైన్స్ చెబుతోంది. సూర్యుడు 7 గుర్రాల రథంపై సంచరిస్తాడని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ 7 గుర్రాలు వేదాల్లోని 7 ప్రధాన ఛందస్సులకు ప్రతీకలు. అవి: గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. సూర్యకాంతిలోని 7 రంగులకు ఈ 7 గుర్రాల రూపాలు సరిపోతాయని ఆధ్యాత్మిక వేత్తలు భావిస్తారు. అంటే అటు సైన్స్ పరంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఈ సంఖ్యకు విడదీయలేని సంబంధం ఉంది.