News December 29, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. జిల్లాలపై నిర్ణయం?

image

AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్షించనున్నారు. అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మార్పులపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Similar News

News December 30, 2025

బంగ్లా మాజీ ప్రధాని మృతి.. మోదీ దిగ్భ్రాంతి

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి, బంగ్లా ప్రజలకు సంతాపం తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. బంగ్లా మొదటి మహిళా ప్రధానిగా ఆమె ఇండియాతో సంబంధాలు, అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. 2015లో ఖలీదాతో సమావేశమయ్యానని గుర్తు చేసుకున్నారు.

News December 30, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,800 పతనమై రూ.1,24,850 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.23వేలు తగ్గి కిలో రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 30, 2025

నిమ్మలో గానోడెర్మా తెగులు – నివారణ

image

నిమ్మచెట్ల కాండంపై పుట్టగొడుగుల మాదిరిగా ఏర్పడి చెట్లు క్షీణించడాన్ని గానోడెర్మా తెగులు అంటారు. పుట్టగొడుగులు లాంటివి కాండంపై గుర్తిస్తే చాకుతో వాటిని తీసివేసి, కాల్చి వేయాలి. తర్వాత తెగులు సోకిన భాగాలపై బోర్డోపేస్టును పూయాలి. 1 శాతం బోర్డో మిశ్రమాన్ని లేదా లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. చొప్పున కలిపిన ద్రావణాన్ని పీచువేర్లు తరలించేటట్లు పాదుల్లో పోయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.