News December 29, 2025
నంద్యాల: పాపకు పాలిచ్చి.. హృదయం కన్నీరు పెట్టే ఘటన ఇది

గడివేముల(M) మంచాలకట్ట వద్ద SRBCలో ఆదివారం ఇద్దరు పిల్లలు సహా తల్లి దూకింది. వీరిని ఒండుట్లకు చెందిన ఎల్లా లక్ష్మీ(23), వైష్ణవి(4), సంగీత(5 నెలలు)గా గుర్తించారు. లక్ష్మీ, రమణయ్య ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సంగీత అనారోగ్యం విషయంలో భర్త, అత్తమామలతో గొడవ జరిగినట్లు సమాచారం. గని గ్రామంలో పాపకు వైద్యం చేయించిన లక్ష్మీ బస్ ఎక్కి SRBC వద్ద దిగి సంగీతకు పాలిచ్చింది. అనంతరం కాలువలో దూకినట్లు సమాచారం.
Similar News
News January 2, 2026
హలో ఇంట్రోవర్ట్స్.. ఇవాళ మీ రోజే!

ఇవాళ ఇంట్రోవర్ట్స్ డే. అందరిలో ఉండటం కన్నా ఒంటరిగా ఉండేందుకే వీరు ఇష్టపడతారు. ఇంటికొచ్చిన బంధువులతో ఎలా మాట కలపాలి? ఏం అడగాలో కూడా తెలియక సైలెంట్‌గా ఉండిపోతారు. తిండి దగ్గర కూడా మొహమాటపడుతూ ఇబ్బందిపడుతుంటారు. తమ కోపం, బాధ, సంతోషం.. ఏదైనా లోలోపలే దాచుకుంటారు. ఐన్‌స్టీన్ నుంచి ప్రభాస్ వరకు ఎందరో ప్రముఖులు ఇంట్రోవర్ట్సే. మౌనం వీరికి బలహీనత కాదు ఒక గొప్ప శక్తి. మీ గ్యాంగ్‌లో ఇలాంటి వారున్నారా?COMMENT
News January 2, 2026
పొదిలి: తల్లిదండ్రులు తిట్టారని..!

పొదిలి మండలం జాఫ్లాపురంలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు(5వ తరగతి) స్కూల్‌కు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో నిన్న పొదిలి లక్ష్మీనరసింహ స్వామి కొండకు వెళ్లారు. ఏదైనా పని చేస్తామని భోజనం పెట్టాలని కోరారు. రాత్రి అక్కడే నిద్రించిన పిల్లలు ఉదయాన్నే ఆవులను మేతకు తీసుకెళ్లారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇవాళ ఇంటికి తీసుకొచ్చారు.
News January 2, 2026
ఏపీకి రానున్న సోనియా గాంధీ, రాహుల్

AP: ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో చేపట్టే ఆందోళనల్లో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక పాల్గొననున్నారు. ఈ గ్రామంలోనే 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. దీంతో అదే రోజున, అదే ప్రాంతంలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు.


